కూన శ్రీశైలం గౌడ్.. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో పేరున్న నాయకుడు. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుత్బుల్లాపూర్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన 2009లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. 2005-2009 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశారు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2021లో కాంగ్రెస్ సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్‌లో బీజేపీ తరపున బరిలో నిలిచారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానందగౌడ్‌పై పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్‌కు బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి కోలన్ హనుమంతరెడ్డి బరిలో ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ బీజేపీ-బీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొంది. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ వైపే మొగ్గు చూపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వరుసగా కూన శ్రీశైలంగౌడ్ ఓడిపోవడంతో ఆయనపై సానుభూతి పవనాలు వీచినట్లుగా సర్వేలు తేల్చాయి. పైగా ఓ చర్చ వేదికలో కూన శ్రీశైలం గౌడ్‌పై బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానందగౌడ్ భౌతికదాడికి పాల్పడ్డారు. ఈ తీరును ప్రజలు హర్షించలేదు. మరీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 57 | 1 | 247,041,824 | 10th Pass | 2,719,996 |