Home » Telangana » Assembly Elections » Pargi
పరిగి నియోజకవర్గం వికారాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుంది. 2009లో నియోజకవర్గాల పునర్వివభజనలో భాగంగా పరిగి కొత్తగా ఏర్పాటైంది. 1952లో ఏర్పడిన పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటివరకూ 15సార్లు జరిగిన ఎన్నికలు జరగ్గా.. అత్యధికంగా ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ, ఐదుసార్లు టీడీపీని ఎన్నుకున్నారు. అలాగే బీఆర్‌ఎస్ పార్టీ ఓసారి గెలిచింది. ఈ నియోజకవర్గంలో ఏడు మండలాలున్నాయి. పరిగి, గండీడ్, మహ్మదాబాద్, కులకచర్ల, చౌడాపూర్, పూడూరు మండలాలు. మొత్తం 2,52,379 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,27,835 మంది కాగా.. మహిళా ఓటర్లు 1,24,537 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన కొప్పుల హరీశ్వర్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి రామ్మోహన్ రెడ్డి (ఇండిపెండెంట్) పై 14,444 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.రామ్మోహన్ రెడ్డి.. తన సమీప ప్రత్కర్థి కొప్పుల హరీశ్వర్ రెడ్డి (బీఆర్ఎస్) పై 5,163 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రామ్మోహన్ రెడ్డికి 68,098 ఓట్లు రాగా.. హరీశ్వర్ రెడ్డికి 62,935 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన కొప్పుల మహేష్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి టి.రామ్మోహన్ రెడ్డి (కాంగ్రెస్) పై 15,840 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మహేష్ రెడ్డికి 83,471 ఓట్లు రాగా.. రామ్మోహన్ రెడ్డికి 67,631 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |