ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి యశస్వినీ రెడ్డి బరిలో ఉన్నారు. ఎర్రబెల్లి దయాకరరావు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. డబుల్ హ్యాట్రిక్ సాధించిన అతికొద్ది మందిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకరు. ఎర్రబెల్లి దయాకర్ రావు తొలిసారి పోటీచేసిన 1983 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 1987లో వరంగల్ డిసీసీబీ అధ్యక్షునిగా పని చేశారు. 1994లో తొలిసారి వర్దన్నపేట నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999, 2004లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. 2008లో లోక్ సభ ఉప ఎన్నికలో వరంగల్ నుంచి బరిలోకి దిగిన దయాకర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రవీంద్ర నాయక్‌పై ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత తన అసెంబ్లీ స్థానాన్ని పాలకుర్తికి మార్చుకున్న దయాకర్ రావు అక్కడ కూడా వరుసగా మూడు సార్లు గెలిచి ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్ విజయాలను సాధించారు. 2009, 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో గెలిచారు. 2014లో దుగ్యాల శ్రీనివాస రావుపై, 2018 లో జంగ రాఘవ రెడ్డిపై 53,009 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 67 | 3 | 126,333,176 | 10th Pass | 46,749,800 |