తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఆసక్తిరేపుతున్న నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న పాలేరు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఒకటిగా ఉంది. ఖమ్మం లోక్‌సభ పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇది జనరల్ స్థానంగా ఉంది. ఖమ్మం రూరల్, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తున్నాయి. ఇక మొత్తం ఓటర్ల సంఖ్య 1,94,037గా ఉంది. రాష్ట్ర మాజీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గ గత ఎమ్మెల్యేల జాబితా విషయానికి వస్తే.. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన రాంరెడ్డి వెంకట్‌రెడ్డి వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆయన మరణం కారణంగా 2016లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన తుమ్మల నాగేశ్వరరావు ఘనవిజయాన్ని సాధించారు. 2018లో పోటీ ఎవరెవరి మధ్య? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పాలేరు బరిలో నిలిచిన కందాల ప్రభాకర్ రెడ్డి తన సమీప అభ్యర్థి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావుపై 7,669 ఓట్ల తేడాతో గెలిచారు. మొత్తం 92.09 శాతం పోలింగ్ నమోదు కాగా కందాల ప్రభాకర్ రెడ్డికి 81,407 ఓట్లు, తుమ్మల నాగేశ్వరరావుకి 81,738 ఓట్లు, సీపీఐ(ఎం) అభ్యర్థి బత్తుల హైమావతికి 6,769 ఓట్లు, నందిగం రాజ్‌కుమార్‌కు 6,101 ఓట్లు పడ్డాయి. దీంతో టీఆర్ఎస్ సీటును కాంగ్రెస్ గెలుచుకున్నట్టయ్యింది. అయితే కొంతకాలానికి కందాల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. ఇక 2014లో రామ్‌రెడ్డి వెంకట్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, టీడీపీ తరపున పోటీ చేసిన బేబీ స్వర్ణ కుమారి మద్దినేనిపై 21,863 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాగా మూడవ స్థానంలో నిలిచిన సీపీఐ(ఎం) అభ్యర్థి పోతినేని సుదర్శన్ రావు 44,245 ఓట్లు సాధించారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |