నిజామాబాద్ పరిధిలోని ఈ నియోజకవర్గ జనాభా మొత్తం 3,11,152. వోటర్ల సంఖ్య 1,55,777. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఈ అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యావత్ నిజామాబాద్ నగరం ఈ అసెంబ్లీ స్థానం పరిధిలో ఉంది. 1952లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముహమ్మద్ దవార్ హుస్సెన్ గెలుపొందారు. ఆ తరువాత 1957 జరిగిన ఎన్నికల్లోనూ ఆయనే విజయం సాధించారు. 1962,67,72 నాటి సాధారణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు హరినారాయణ్, కేవీ గంగాధర్, వీ చక్రధర్ వరుసగా గెలుపొందారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఎ.కిషన్‌దాస్,1983, 85లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున డి.సత్యనారాయణ గెలుపొందారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ధర్మపురి శ్రీనివాస్, 94 ఎన్నికల్లో టీడీపీ తరుపున సతీశ్ పవార్ విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన రెండు సాధారణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు చెందిన ధర్మపురి శ్రీనివాస్ విజయంసాధించారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 2010లో జరిగిన బైపోల్‌లోనూ బీజేపీకి చెందిన ఇ.లక్ష్మీనారాయణ గెలిచారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు సాధారణ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నేత బిగాల గణేశ్ గుప్త ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 నాటి ఎన్నికల్లో ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి తాహెర్ బిన్ హమ్దాన్‌పై 25,841 వోట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఎంఐఎంకు చెందిన మిర్ మజాజ్ అలీ షేక్‌పై 10,308 వోట్ల మెజారిటీతో విజయం సాధించారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |