మెదక్ జిల్లాలోని శాసనసభ స్థానాల్లో ఇదొక్కటి. ఈ నియోజవకర్గం మెదక్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. 1952లో ఏర్పాటైన ఈ శాసనసభ స్థానంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,99,626గా ఉంది. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, కుల్చారం, ఎల్దుర్తి, శివంపేట, కౌడిపల్లె, చిలిప్‌చెడ్.. సంగారెడ్డి జిల్లాలోని హత్‌నూర మండలాలు దీని పరిధిలో ఉన్నాయి. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారి జాబితా విషయానికి వస్తే 1978లో చిలుముల విఠల్ రెడ్డి (సీపీఐ), 1983లో చౌటి జగన్నాథ్ రావు(కాంగ్రెస్), 1985, 1989, 1994లలో చిలుముల విఠల్ రెడ్డి సీపీఐ తరపున వరుసగా గెలిచారు. ఇక 1999, 2004, 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వాకిటి సునీతా లక్ష్మారెడ్డి వరుసగా గెలుపొందారు. 2014, 2018లో టీఆర్ఎస్ తరపున చిలుమల మదన్‌రెడ్డి విజయం సాధించారు. 2018లో పోటీపడిన అభ్యర్థుల విషయానికి వస్తే టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన చిలుముల మదన్ రెడ్డి 38,320 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మదన్ రెడ్డికి 105,665 ఓట్లు, సునీతా లక్ష్మారెడ్డి 67,345 ఓట్లు, సింగాయపల్లి గోపీకి (బీజేపీ) 2,848 చొప్పున ఓట్లుపడ్డాయి. 2014లోనూ ప్రధానంగా వీరిద్దరి మధ్యే పోటీ జరిగింది. టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన మదన్ రెడ్డికి 85,890 ఓట్లు పడగా 14,217 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక సునీతా లక్ష్మారెడ్డికి (కాంగ్రెస్) 71,673 ఓట్లు, చాగన్ల బల్విందర్‌నాథ్ 6,088 చొప్పున ఓట్లుపడ్డాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |