వరంగల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో నర్సంపేట ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో నర్సంపేట, ఖానాపూరం, చెన్నారావుపేట, నెక్కొండ, నల్లబెల్లి మండలాలు ఉన్నాయి. మొత్తం 2,18,293 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,08,019 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,10,271 మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికలు పోటీ ఎవరెవరి మధ్య? 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి దొంతి మాధవరెడ్డి (కాంగ్రెస్) పై 16,975 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి 94,430 ఓట్లు రాగా.. మాధవరెడ్డికి 77,455 ఓట్లు వచ్చాయి. ఇక 2009 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి దొంతి మాధవ రెడ్డి (కాంగ్రెస్) పై 8,623 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డికి 75,400 ఓట్లు రాగా.. మాధవ రెడ్డికి 66,777 ఓట్లు వచ్చాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన దొంతి మాధవ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి (బీఆర్ఎస్) పై 18,376 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మాధవ రెడ్డికి 76,144 ఓట్లు రాగా.. సుదర్శన్ రెడ్డికి 57,768 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |