రాష్ట్ర రాజధాని నగర హైదరాబాద్ జిల్లాలో ఉన్న మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాంపల్లి ఒకటి. ఈ శాసన సభ నియోజకవర్గం సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోనికి వస్తుంది. ఏఐఎమ్‌ఐఎమ్‌కు చెందిన జాఫర్ హుస్సేన్ మెరాజ్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఈ నియోజక వర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,79,353. హైదరాబాద్ నగరంలోని నాంపల్లి, మాసబ్ ట్యాంక్, ఆసిఫ్ నగర్, మెహదీ పట్నం, సైఫాబాద్, మల్లేపల్లి, చింతల్ బస్తీ, గుడి మల్కాపూర్ మొదలైన ప్రాంతాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఈ నియోజక వర్గం ఏర్పాటైన తొలి పర్యాయంలో అంటే 2009లో ఏఐఎమ్‌ఐఎమ్‌కు చెందిన మొహమ్మద్ విరాసత్ రసూల్ ఖాన్ గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ అంటే 2014, 2018లో జాఫర్ హుస్సేన్ మెరాజ్ గెలుపొందారు. 2018లో పోటీ ఎవరి మధ్య? 2018లో నాంపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా ఏఐఎమ్‌ఐఎమ్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే గట్టిపోటీ నెలకొంది. ఏఐఎమ్‌ఐఎమ్‌కు చెందిన జాఫర్‌కు 2018లో 42 శాతం ఓట్లు పడి దాదాపు 9 వేల మెజారిటీతో ఆయన గెలుపొందారు. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ సభ్యుడు మహ్మద్ ఫిరోజ్ ఖాన్ 35 శాతం ఓట్లు సాధించారు. టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఆనంద్ కుమార్ కేవలం 12 శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో కూడా ఈ నియోజక వర్గం నుంచి జాఫర్ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఏఐఎమ్‌ఐఎమ్ తరఫున జాఫర్, టీడీపీ తరఫున ఫిరోజ్ ఖాన్ బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో జాఫర్ 47.5 శాతం ఓట్లు సాధించారు. ఫిరోజ్ ఖాన్‌కు 34.6 శాతం ఓట్లు పడ్డాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |