కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీనియర్ పొలిటీషన్. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు. అలాగే నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో కూడా ముఖ్యమైన లీడర్. 1999, 2004, 2009, 2014లో నల్గొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. నల్గొండ స్థానం నుంచి వరుసగా మూడు సార్లు గెలుపొందిన తొలి సభ్యుడు వెంకట్‌రెడ్డే. దివంగత ముఖ్యమంత్రులు వైఎస్, రోశయ్య కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజనకు ముందు చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో కూడా మంత్రిగా సేవలందించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం భువనగిరి ఎంపీగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేసులో ఉన్న ముఖ్య నేతల్లో ఈయన కూడా ఒకరు. 2018లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి బరిలోకి దిగి విక్టరీ సాధించారు. తన సమీప బీఆర్ఎస్ ప్రత్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై 4500 ఓట్ల తేడాతో వెంకట్‌రెడ్డి గెలుపొందారు. ఇక 2022, ఏప్రిల్ 10న కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ స్టార్ క్యాంపెనర్‌గా నియమించింది. అంతేకాకుండా కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో కూడా స్థానం కల్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 2023లో ఇలా.. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతన్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరోసారి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బరిలోకి దిగారు. ఇప్పటికే ఇదే నియోజకవర్గం నుంచి ఐదు సార్లు పోటీ చేయగా నాలుగు సార్లు విజయం సాధించి వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పని చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక బీఆర్ఎస్ నుంచి కంచర్ల భూపాల్‌రెడ్డి, బీజేపీ నుంచి ఎం.శ్రీనివాస్‌గౌడ్ పోటీలో ఉన్నారు. ఈసారి కూడా నువ్వానేనా? అన్నట్టుగా కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య నెలకొంది. విజయం ఎవర్ని వరిస్తుందో వేచి చూడాలి.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 60 | 6 | 395,547,008 | 12th Pass | 64,477,632 |