• Home » Telangana » Assembly Elections » Nagarjuna Sagar

నల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో నాగార్జునసాగర్ ఒకటి. గుర్రంపోడు, పెద్దవూర, అనుముల, త్రిపురారం, నిడమానూరు, హాలియా, తిరుమలగిరి, నందికొండ మండలాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభనజనలో భాగంగా 2009 తర్వాత నాగార్జునసాగర్‌గా ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,08,253 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,03,510 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,04,736 మంది ఉన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య విజయం సాధించినా.. అనతికాలంలోనే ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్ గెలిచాడు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఆయనే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి.. తన సమీప ప్రత్యర్థి టి.చిన్నపరెడ్డి (టీడీపీ) పై 6,214 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో జానారెడ్డికి 67,958 ఓట్లు, చిన్నపరెడ్డికి 61,958 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన కుందూరు జానారెడ్డి.. తన సమీప ప్రత్యర్థి నోముల నర్సింహయ్య (బీఆర్ఎస్)పై 16,780 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో జానారెడ్డికి 69,684 ఓట్లు రాగా, నర్సింహయ్యకు 52,684 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల నర్సింహయ్య.. తన సమీప ప్రత్యర్థి కుందూరు జానారెడ్డి (కాంగ్రెస్) పై 7,771 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో నర్సింహయ్యకు 83,743 ఓట్లు రాగా.. జానా రెడ్డికి 76,017 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన నర్సింహయ్య 2020 డిసెంబర్‌లో అనారోగ్య కారణంగా మరణించారు. దీంతో 2021లో ఉప ఎన్నికలు వచ్చాయి. 2021 ఉప ఎన్నికలు.. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ పోటీ చేసి.. తన సమీప ప్రత్యర్థి కుందూరు జానారెడ్డి (కాంగ్రెస్) పై 18,872 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భగత్‌కు 89,804 ఓట్లు రాగా.. జానారెడ్డికి 70,932 ఓట్లు వచ్చాయి.

Readmore

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2018

2023 2018 2014
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00

నాగార్జున సాగర్ నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

తెలంగాణ విజేత/ఓడిపోయిన నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

Latest News

తాజా వార్తలు

మరిన్ని చదవండి