Home » Telangana » Assembly Elections » Mulug
ములుగు జిల్లాలో ఈ నియోజకవర్గం ఉంది. మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్ అయ్యింది. నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ప్రస్తుతం ములుగులో 9 మండలాలు ఉన్నాయి. అవి ఏటూరు నాగారం, గోవిందరావుపేట, కన్నైగూడెం, మంగపేట, ఎస్ఎస్ తాడ్వాయి, ములుగు, వెంకటాపురం, వెంకటాపూర్, వాజీడు. 1952లో హనుమంత్ రావు(పీపుల్ డెమోక్రటిక్ పార్టీ), 1957లో రాజేశ్వరరావు(పీపుల్ డెమోక్రటిక్ పార్టీ), 1962లో ముసినెపల్లి కృష్ణయ్య(కాంగ్రెస్), 1967లో సంతోష్ చక్రవర్తి(స్వతంత్య్ర అభ్యర్థి), 1972లో సంతోష్ చక్రవర్తి(కాంగ్రెస్), 1978, 1983లలో పొరిక జగన్ నాయక్(కాంగ్రెస్), 1985లో అజ్మీరా చందూలాల్(టీడీపీ), 1989లో పొరిక జగన్ నాయక్(కాంగ్రెస్),1994లో అజ్మీరా చందూలాల్(టీడీపీ), 1996లో భోజారావు(టీడీపీ), 1999, 2004ల్లో పొదెం వీరయ్య(కాంగ్రెస్), 2009లో దనసరి అనసూయ(సీతక్క)(టీడీపీ), 2014లో అజ్మీరా చందూలాల్(టీఆర్ఎస్), 2018లో దనసరి అనసూయ(కాంగ్రెస్) నుంచి విజయం సాధించారు. ములుగులో మొత్తంగా 2 లక్షల 8 వేల 176 మంది ఓటర్లుండగా 1 లక్షకు పైగా పురుష ఓటర్లు, మరో లక్షకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్క శాసన సభ్యురాలిగా ఉన్నారు. 2014, 2018లలో.. 2014లో టీఆర్ఎస్ నుంచి చందూలాల్ గెలిచారు. ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత పొడెం వీరయ్యను 16 వేల 399 మెజారిటీతో ఓడించారు. అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నేత సీతక్క మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 2018లో కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ నుంచి సీతక్క విజయం సాధించారు. ఆ సమయంలో సమీప ప్రత్యర్థి చందూలాల్‌పై 22 వేల 671 ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. సీతక్కకు 88 వేల 971 ఓట్లు రాగా, చందూలాల్‌కు 66 వేల 300 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |