ధనసరి అనసూయ అలియాస్ సీతక్క తెలంగాణకు చెందిన రాజకీయ నాయకురాలు. ములుగు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆమె.. ఈ 2023 ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచే బరిలోకి దిగారు. అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయ అరగేంట్రానికి ముందు.. 15 ఏళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైటు నాయకురాలు. 2004లో తొలిసారి తెలుగుదేశం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీచేసి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్యపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన 2014 వరుసగా మూడోసారి టీడీపీ అభ్యర్థినిగా బరిలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పి సైకిల్ దిగిన సీతక్క కాంగ్రెస్ గూటికి చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందులాల్‌పై 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి 22,671 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పార్టీకి సీతక్క చేస్తున్న సేవలు గుర్తించిన కాంగ్రెస్ హైకమాండ్ 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా పదవి ఇచ్చింది. ఈ ఎన్నికల్లో తనతోపాటు కచ్చితంగా కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని.. అంతేకాదు తప్పకుండా కీలక శాఖకు మంత్రిగా కూడా వ్యవహరిస్తానని సీతక్క ఎంతో ధీమాగా చెబుతున్నారు.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 52 | 6 | 8,283,669 | Doctorate | 2,474,764 |