నల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మిర్యాలగూడ ఒకటి. రైస్‌మిల్ ఇండస్ట్రీలో ఆసియా ఖండంలోనే రెండో స్థానంలో ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గంలో గిరిజనులు, కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,09,792 ఓట్లు ఉండగా.. వీరిలో పురుషులు 1,03,752 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,06,029 మంది ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి, మాడుగులపల్లె, అడవిదేవులపల్లె మండలాలు ఉన్నాయి. 1952లో పెద్దమునగాల నియోజకవర్గంగా ఉండగా.. 1957లో మిర్యాలగూడగా మారిపోయింది. సీపీఎం తరపున జూలకంటి రంగారెడ్డి మూడుసార్లు గెలువగా 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో ఆ పార్టీ గెలిచిన ఏకైక స్థానం మిర్యాలగూడ కావడం విశేషం. ప్రస్తుతం ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన జూలకంటి రంగారెడ్డి.. తన సమీప ప్రత్యర్థి టి.గంగాధర్(కాంగ్రెస్) పై 4,363 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రంగారెడ్డికి 52,227 ఓట్లు రాగా.. గంగాధర్‌కు 47,864 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఎన్.భాస్కర్ రావు.. తన సమీప ప్రత్యర్థి అమరేందర్ రెడ్డి (బీఆర్ఎస్) పై 5,811 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భాస్కర్ రావుకు 62,059 ఓట్లు రాగా.. అమరేందర్ రెడ్డికి 56,005 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎన్.భాస్కర్ రావు.. తన సమీప ప్రత్యర్థి ఆర్.కృష్ణయ్య (కాంగ్రెస్) పై 30,652 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భాస్కర్ రావుకు 83,931 ఓట్లు రాగా.. కృష్ణయ్యకు 53,279 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |