మల్లా రెడ్డి.. తెలంగాణలో మోస్ట్ పాపులర్ నాయకుడు. ఆయన యాస, భాషలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. హైదరాబాద్ నగరంలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు నెలకొల్పారు. ఈయన ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మల్కాజ్‌గిరి జిల్లాలో మేడ్చల్ ఒక నియోజకవర్గం. 2018 ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి కిచ్చనగారి లక్ష్మారెడ్డిపై మల్లారెడ్డి గెలుపొందారు. భూకబ్జాలకు పాల్పడ్డారంటూ మల్లారెడ్డిపై విమర్శలున్నాయి. 2014లో పొలిటికల్ ఎంట్రీ.. 2014లో రాజకీయ అరంగేట్రం చేశారు. 2014, మార్చి 19న తెలుగు దేశంలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణలో తెలుగు దేశం నుంచి గెలిచిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డి ఒక్కరే. అనంతరం 2016 జూన్ నెలలో టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. ఇక 2018లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో కేసీఆర్ కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2023లో ఇలా.. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ తరపున మేడ్చల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి వజ్రేష్ యాదవ్, బీజేపీ నుంచి ఏనుగు సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఫైటింగ్ నడుస్తోంది. ఈసారి విజయం ఎవర్నీ వరిస్తుందో వేచి చూడాలి.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 70 | 1 | 959,473,408 | 12th Pass | 73,994,304 |