పెద్దపల్లి జిల్లాలోని రెండు శాసనసభ నియోజకవర్గాల్లో మంథని నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో కమనాపూర్, మంథని, కాటారం, మహాదేవపూర్, ముత్తారం, మల్‌హర్‌రావు, మహాముత్తారం, పలిమెల, రామగిరి మండలాలు ఉన్నాయి. 1957లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,03,387గా ఉంది. ఈ నియోజకవర్గం మొదటి నుంచి జనరల్ స్థానంగానే ఉంది. 1957, 1962, 1967, 1972లలో పాములపర్తి వెంకట నరసింహారావు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978లో సీ.నారాయణరెడ్డి, ఆ తర్వాత 1983, 1985, 1989లలో దుద్దిళ్ల శ్రీపాదరావు విజయాలు సాధించారు. ఇక 1994లో చంద్రుపట్ల రాంరెడ్డి, 1999, 2004, 2009లో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, 2014లో పుట్ట మధు, 2018లో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. 2018 ఎన్నికల విషయానికి ఇస్తే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు మధ్య ప్రధాన పోటీ జరిగింది. మధుపై శ్రీధర్ బాబు 16,230 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే రాష్ట్రం విజభజన తర్వాత తొలిసారి జరిగిన 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పుట్ట మధు విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సమీప ప్రత్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై 19,360 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక 2023 ఎన్నికల విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీఆర్ఎస్ నుంచి పుట్ట మధు, బీజేపీ నుంచి చంద్రుపట్ల సునీల్‌రెడ్డి బరిలో ప్రధానంగా పోటీ పడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |