రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మానుకొండూర్ శాసన సభా స్థానం ఒకటి. కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఇది కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రసమయి బాలకిషన్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. ఈ నియోజక వర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,91,724. మానకొండూర్, ఎల్లంతకుంట, బెజ్జంకి, శంకరపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం మొదైలన ప్రాంతాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఈ నియోజక వర్గం ఏర్పాటైన తొలి పర్యాయంలో అంటే 2009లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరేపల్లి మోహన్ విజయం సాధించారు. ఆ తర్వాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన రసమయి బాలకిషన్ గెలుపొందారు. 2018లో పోటీ ఎవరి మధ్య? 2018లో మానకొండూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ మంచి మెజారీటీతో గెలుపొందారు. 47 వేల పైచిలుకు మెజారిటీ గెలుపొందారు. కాంగ్రెస్ నాయకుడు ఆరెపల్లి మోహన్ రెండో స్థానంలో నిలిచారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన రసమయి బాలకిషన్ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఆరెపల్లి మోహన్ రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో శోభకు 30 వేల పైచిలుకు మెజారిటీ లభించింది.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |