Mynampalli Hanumantha Rao: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన వ్యక్తుల్లో మైనంపల్లి హనుమంతరావు ఒకరు. ఆయన 1998లో తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2008 జరిగిన ఉప ఎన్నికలలో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణ వచ్చిన తర్వాత బీజేపీ పొత్తుతో భాగంగా 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయనకు టికెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ ఆ పార్టీ విడుదల చేసిన జాబితాలో తన పేరు లేకపోవడంతో అదే రోజు సాయంత్రం బీఆర్ఎస్‌లో చేరి టికెట్ సంపాదించి చేమకూర మల్లారెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత 21 ఏప్రిల్ 2015లో తెలంగాణ రాష్ట్ర సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2017లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత మైనంపల్లి హన్మంతరావు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి టికెట్ లభించకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. మైనంపల్లికి బీఆర్ఎస్ షాక్.. తెలంగాణ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. షెడ్యూల్ రాకముందే బీఆర్ఎస్ పార్టీ నలుగురు మినహా మిగిలిన వారందరితో జాబితాను రెడీ చేసి వదిలింది బీఆర్ఎస్. తనతో పాటు తన కుమారుడికి సైతం టికెట్ కేటాయించాల్సిందేనన్న మైనంపల్లి హనుమంతరావుకి ఆ లిస్ట్ షాక్ ఇచ్చింది. లిస్ట్ విడుదలైన సమయంలో తిరుపతిలో ఉన్న ఆయన మంత్రి హరీష్ రావుపై విరుచుకుపడ్డారు. హరీష్ రావు తన నియోజకవర్గం గురించి మాత్రమే చూసుకోవాలని హెచ్చరికలు జారీ చేసి హాట్ టాపిక్ అయ్యారు. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హాట్ టాపిక్‌గా.. ఆ తరువాత మంత్రి మల్లారెడ్డిని సైతం మైనంపల్లి ఉతికి ఆరేశారు. మల్లారెడ్డిది తన స్థాయి కాదని, పాలిటిక్స్‌లో ఓ బచ్చాగాడని విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి బఫూన్ మంత్రి అని, అంగోటా చాప్ అని ఓ వీడియోలో మైనంపల్లి ఫైర్ అయ్యారు. అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ కొద్ది రోజుల పాటు హాట్ టాపిక్‌గా నిలిచారు. ఆ తరువాత బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజిగిరి స్థానం నుంచి మైనంపల్లి, ఆయన కుమారుడు రోహిత్ వచ్చేసి మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. మైనంపల్లి విజయం ఖాయమేనా? ఇక మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి.. బీజేపీ నుంచి రామచంద్రరావు పోటీ చేశారు. మెదక్ స్థానంలో బీజేపీ నుంచి మురళీయాదవ్, బీఆర్ఎస్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డి పోటీలో నిలిచారు. మల్కాజ్‌గిరి నుంచి అయితే మైనంపల్లి విజయం ఖాయంగానే కనిపిస్తోంది. ఆయనకు అర్థబలం, అంగబలం ఎక్కువగా ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇక మెదక్ విషయానికి వస్తే.. గతంలో మెదక్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా నడిచింది. కానీ ఈసారి పరిస్థితులు మారాయంటున్నారు. మైనంపల్లి తనతో పాటు తన కుమారుడిని గెలిపించుకుంటారో లేదోనన్న ఆసక్తి అయితే సర్వత్రా నెలకొంది.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 57 | 1 | 148,409,632 | Illiterate | 34,142,000 |