హైదరాబాద్‌లోని మలక్‌పేట్ నియోజకవర్గానికి ప్రస్తుతం ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనే విజయం సాధించారు. 1952లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో మొత్తం 2,61,705 ఉన్నారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట్, సైదాబాద్, చంచల్‌గూడ, ఆజంపురా, మూసారాంబాగ్, గడ్డిఅన్నారం, ఛాదర్‌ఘాట్ ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి అహ్మద్ బలాలా 53,281 ఓట్లతో గెలుపొందారు. టీడీపీకి చెందిన తన సమీప అభ్యర్థి ముహమ్మద్ ముజఫర్ అలీ ఖాన్‌పై 23,512 ఓట్ల మెజారిటీతో గెలిచి సీటును నిలబెట్టుకున్నారు. అంతకుమునుపు 2014లో జరిగిన ఎన్నికల్లో అహ్మద్ బలాలా, బీజేపీ అభ్యర్థి బి.వెంకట్ రెడ్డిపై 23,263 ఓట్లతో గెలుపొందారు. 2009 నాటి ఎన్నికల్లోనూ ఆయనే గెలుపొందారు. ఇక 1952లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో పీపుల్స్ డెమాక్రటిక్ ఫ్రంట్ తరపున అబ్దుల్ రహ్మాన్ విజయం సాధించారు. 1957, 1962 ఎన్నికల్లో మిర్ అహ్మద్ అలీ ఖాన్(కాంగ్రెస్), 1967, 1972 ఎన్నికల్లో సరోజినీ పుల్లా రెడ్డి (కాంగ్రెస్), 1978లో కండల ప్రభాకర్ రెడ్డి(జనతా పార్టీ), 1983,85 ఎన్నికల్లో ఇంద్రసేనా రెడ్డి(బీజేపీ), 1989 ఎన్నికల్లో పీ.సుధీర్ కుమార్(కాంగ్రెస్), 1994లో మల్‌రెడ్డి రంగారెడ్డి(టీడీపీ), 1999లో ఇంద్రసేనారెడ్డి(బీజేపీ), 2004లో మల్‌రెడ్డి రంగారెడ్డి (కాంగ్రెస్) గెలిచారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |