ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో మక్తల్ నియోజకవర్గం ఒకటి. జిల్లాల విభజన తర్వాత మక్తల్ నియోజకవర్గం నారాయణపేట జిల్లా పరిధిలోకి వెళ్లింది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి. మక్తల్, మాగనూరు, ఉట్కూరు, ఆత్మకూరు, నర్వ మండలాలు మక్తల్ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటి వరకు రెండు సార్లు ఎన్నికలు జరగ్గా ఒకసారి కాంగ్రెస్ పార్టీ, మరోసారి టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాయి. అయితే రెండుసార్లు గెలిచింది ఒక్కరే అభ్యర్థి కావడం గమనించాల్సిన విషయం. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి ఎల్కోటి ఎల్లారెడ్డిపై 10,027 ఓట్ల తేడాతో గెలిచారు. 2016లో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. దీంతో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు. 2018 ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి జలంధర్‌రెడ్డిపై 26,906 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్-టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థి కొత్తకోట దయాకర్‌రెడ్డి పోటీ చేయగా ఆయన మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ప్రస్తుతం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి వాకిటి శ్రీహరి, బీజేపీ నుంచి జలంధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |