తెలంగాణలో తొలి మహిళా (విద్యాశాఖ) మంత్రిగా చరిత్ర సృష్టించిన సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి సబితా ఇంద్రారెడ్డికి పోటీగా కాంగ్రెస్ తరఫున కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి బరిలోకి నిలిచారు. గతంలో ఆయన మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. ఇక బీజేపీ నుంచి అందెల శ్రీరాములు యాదవ్ పోటీ చేస్తున్నారు. పోటీ ప్రధానంగా ఈ ముగ్గురి మధ్య ఉండే అవకాశం ఉంది. మహేశ్వరం నుంచి ఆమె గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై 9,227 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే.. ఆ తర్వాతి కాలంలో (2019 మార్చి 14న) ఆమె బీఆర్ఎస్‌లో చేరారు. 2019 సెప్టెంబర్ 8న కేసీఆర్ రెండో విడత మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక సబితా ఇంద్రారెడ్డి రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. 2000 సంవత్సరంలో తొలిసారి కాంగ్రెస్ తరపున చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే విజయం సాధించారు. అనంతరం 2009 ఎన్నికల్లోనూ మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొంది వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో హోంశాఖ మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 60 | 5 | 92,728,160 | 12th Pass | 0 |