మధిర అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఒకటి. ఇది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. కాంగ్రెస్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో మధిర, ముదిగొండ, చింతకాణి, బొనకల్, యర్రుపాలెం మండలాలున్నాయి. మొత్తం ఓటర్లు 1,94,322. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి వెంకయ్య గెలుపొందారు. 1957లో సత్యనారాయణ రావు(కాంగ్రెస్), 1962, 1967లలో దుగ్గినేని వెంకయ్య(కాంగ్రెస్), 1972 లో వెంకట్రావమ్మ(కాంగ్రెస్), 1978లో బండారు ప్రసాద్ రావు(కాంగ్రెస్), 1983లో సిద్ధ రెడ్డి(కాంగ్రెస్), 1985, 1989, 1994లలో వెంకటేశ్వరరావు(సీపీఐ), 1998లో వెంకట నర్సయ్య(సీపీఐ), 1999లో కోటేశ్వర రావు(టీడీపీ), 2004లో వెంకట నర్సయ్య(సీపీఐ), 2009, 2014,2018లలో మల్లు భట్టి విక్రమార్క(కాంగ్రెస్) గెలుపొందారు. 2018 ఎన్నికల్లో.. 2018 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థిపై 3,567 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 80,598 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి కమల్ రాజు లింగాలాకు 77,031 ఓట్లు, బీఎల్ఎఫ్‌పీ నుంచి పోటీ చేసిన రాంబాబు కోటాకు 23,030 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ కు 43.12 శాతం, టీఆర్ఎస్ కు 41.21 శాతం ఓట్లు వచ్చాయి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మల్లు భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ నుంచి కమల్ రాజు లింగాలా మళ్లీ పోటీ పడనున్నారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |