కాంగ్రెస్ పార్టీ కీలక నేత మల్లు భట్టి విక్రమార్క ఈ ఎన్నికల్లో మరోసారి మధిర శాసనసభ నియోజకవర్గం నుంచే బరిలో దిగుతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ తరఫున లింగాల కమల్ రాజు పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఇద్దరి మధ్యనే నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉండనుంది. ప్రస్తుతం భట్టి విక్రమార్క మధిర శాసన సభ్యుడిగా ఉన్నారు. ఆయన తొలిసారి 2009 ఎన్నికలలో శాసన సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో కూడా ఇక్కడి నుంచే విజయం సాధించారు. అలాగే 2009 నుండి 2011 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చీఫ్ విప్‌గా ఉన్నారు. 2011 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. ఇక 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో భట్టి విక్రమార్క తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ లింగాల కమల్ రాజుపై 3,567 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. ఇలా మధిర నుంచి వరుసగా 2009, 2014, 2018లో గెలుపొంది హ్యాట్రిక్ నమోదు చేశారు. దీంతో బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన రెండో వ్యక్తిగా విక్రమార్క నిలిచారు. 2019 జనవరి 18న తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా నియామకమయ్యారు. ఈసారి ఎన్నికల్లో కూడా మధిర ప్రజలు తననే గెలిపిస్తారనే ఆశాభావంతో ఉన్నారు మల్లు భట్టి విక్రమార్క.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 63 | 3 | 81,326,608 | Post Graduate | 0 |