మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని నియోజకవర్గాల్లో కూకట్‌పల్లి ఒకటి. 2009 వరకు ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం.. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడింది. హైదరాబాదు శివారులో ఉన్న ఈ నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన సెటిలర్లు అధికంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కూకట్‌పల్లి, అల్లాపూర్, బాలానగర్, మూసాపేట్, ఫతేనగర్, బోయిన్‌పల్లి, ఫిరోజ్ గూడ, బేగంపేట (కొంత భాగం) మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,26,465 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,24,070మంది ఉండగా, మహిళలు 2,02,276 మంది, 116మంది ఇతరులు ఉన్నారు. మొదటిసారి ఈ నియోజకవర్గం నుంచి లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ కూకట్‌పల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ.. తన సమీప ప్రత్యర్థి వడ్డేపల్లి నర్సింగ్ రావు (కాంగ్రెస్) పై 15,643 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో జయప్రకాష్ నారాయణకు 71,753 ఓట్లు రాగా.. నర్సింగ్ రావుకు 56,110 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన మాధవరం కృష్ణారావు.. తన సమీప ప్రత్యర్థి గొట్టిముక్కల పద్మారావు (బీఆర్ఎస్) పై 43,186 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కృష్ణారావుకు 99,874 ఓట్లు రాగా.. పద్మారావుకు 56,688 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాధవరం కృష్ణారావు.. తన సమీప ప్రత్యర్థి నందమూరి వెంకట సుహాసిని (టీడీపీ) పై 41,049 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కృష్ణారావుకు 1,11,612 ఓట్లు రాగా.. సుహాసినికి 70,563 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బీఎస్పీ తరపున పోటీ చేసిన హరీష్ చంద్రారెడ్డికి 12,761 ఓట్లు, బీజేపీ అభ్యర్థి మాధవరం కాంతారావుకు 11,943, నోటాకు 2,134 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |