కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటిగా ఉంది. ఈ నియోజకవర్గంలో కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాత నగర్, లక్ష్మీదేవిపల్లి మండలాలు ఉన్నాయి. 1978లో కొత్తగూడెం నియోజకవర్గం ఏర్పడింది. ఇది జనరల్ స్థానంగా ఉంది. 1978లో జరిగిన ఎన్నికల్లో చేకూరి కాశయ్య, 1983, 1985లలో కోనేరు నాగేశ్వరరావు, 1989లో వనమా వెంకటేశ్వరరావు, 1994లో కోనేరు నాగేశ్వరరావు, 1999, 2004లలో వనమా వెంకటేశ్వరరావు, 2009లో కూనంనేని సాంబశివరావు, 2014లో జలగం వెంకటరావు, 2018లో వనమా వెంకటేశ్వరరావు గెలుపొందారు. విభజన తర్వాత.. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన జలగం వెంకట్రావు గెలుపొందారు. సమీప అభ్యర్థి, వైఎస్సాఆర్సీపీ తరపున పోటీ చేసిన వనమా వెంకటేశ్వరావుపై 16,521 ఓట్ల తేడాతో జలగం గెలిచారు. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు విక్టరీ సాధించారు. జలగం వెంకట్రావుపై 4,139 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే అనంతరం బీఆర్‌ఎస్ గూటికి చేరారు. కాగా వనమా వెంకటేశ్వరరావు అఫిడవిట్ సరిగాలేదంటూ దాఖలు చేయకపోవడంతో వనమాపై అనర్హత వేటుపడింది. అయితే అనర్హతపై ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. 2023లో ఇలా.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు బరిలోకి దిగారు. ఇక బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును జనసేనకు కేటాయించింది. కాగా పొత్తులో భాగంగా ఈ సీటును సీపీఐకి కేటాయిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. సీపీఐ తరపున కూనంనేని సాంబశివరావు ఇక్కడ నుంచి బరిలో నిలిచారు. ఇక పొత్తులో భాగంగా బీజేపీ ఈ సీటుని జనసేనకు కేటాయించగా లక్కినేని సురేందర్‌రావు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా సీపీఐ-బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |