• Home » Telangana » Assembly Elections » Arvind Dharmapuri

Arvind Dharmapuri candidate from Koratla, Telangana Assembly Election 2023

LOST - 10,305
Arvind Dharmapuri
Koratla
BJP

మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ చిన్న కుమారుడైన ధర్మపురి అర్వింద్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఆయన బరిలోకి దిగారు. ఇక కాంగ్రెస్ నుంచి జువ్వాడి నర్సింగరావు పోటీ చేస్తుండగా.. బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల సంజయ్ బరిలో ఉన్నారు. ప్రధానంగా ఈ ముగ్గురి మధ్య పోటీ జరగనుంది. ముఖ్యంగా బీఆర్ఎస్-బీజేపీ మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ జరగొచ్చని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి. ధర్మపురి అర్వింద్ విషయానికి వస్తే 2019లో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితపై విజయం సాధించి సంచలనం సృష్టించారు. కేసీఆర్ కుటుంబమే టార్గెట్‌గా విమర్శలు గుప్పించడంతో పొలిటికల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ప్రపంచ రికార్డు స్థాయిలో 184 మంది అభ్యర్థులను ఓడించి గెలుపొందారనే పేరు కూడా ఉంది. ఇక 1995/96లో హైదరాబాద్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లలో కూడా ఆడారు. అలాగే 2013లో అరవింద్ పౌండేషన్ ఏర్పాటు చేసి పేద పిల్లలకు సాయం చేస్తున్నారు.

Readmore

అభ్యర్థి సమాచారం

Age Cases Total Assets Education Liabilities
47 17 1,074,337,280 Post Graduate 291,283,456

ముఖ్య అభ్యర్థులు

విజయవంతమైన అభ్యర్థుల జాబితా 2018

2018 2014

Latest News

తాజా వార్తలు

మరిన్ని చదవండి