బర్రెలక్క అలియాస్ శిరీష.. ఒక నిరుద్యోగి. 2023 తెలంగాణ ఎన్నికల ముందు వరకు ఆమె పేరు పెద్దగా పరిచయం లేదు. సోషల్ మీడియాలో కొందరికే పరిచయస్థురాలు. అర నిమిషం బర్రెల వీడియోతో శిరీష కాస్తా బర్రెలక్కగా పాఫులర్ సృష్టించింది. ఇంత వరకు ఒకెత్తు అయితే ఎప్పుడైతే కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిందో అప్పటి నుంచి ఆమె పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగింది. ఆమె ధైర్యాన్ని, తెగువను నెటిజన్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఇక ఆమె ఉండే తడికల ఇల్లు.. కనీసం నామినేషన్ వేసేందుకు కూడా డబ్బులు లేకపోయినా విషయం ప్రజల మనసులను చూరగొంది. ఇక ప్రచార పర్వంలోకి దిగిన తర్వాత తనకు వచ్చిన మద్దతు ఊహించలేకపోయింది. సోషల్ మీడియాలో అద్భుతమైన మద్దతు లభించింది. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల నుంచి స్వచ్ఛందంగా వచ్చి ఆమె తరపున ప్రచారం నిర్వహించారు. ఇక కొంత మంది నేతలైతే ఆర్థిక సహాయం కూడా చేసి ప్రోత్సహించారు. యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు అయితే డబ్బుల సాయంతో పాటు ప్రచారం కూడా నిర్వహించారు. అలాగే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా స్వయంగా బర్రెలక్కను కలిసి ప్రచారం చేశారు. అంతేకాకుండా ఆయా వర్గాల నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది. పెద్ద పార్టీలు కోట్ల ఖర్చు చేసి ప్రచారం చేస్తే.. బర్కెలక్క మాత్రం రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం లభించింది. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బర్రెలక్క అద్భుతమైన ఓటు షేర్‌ను సంపాదించింది. ఆయా ఫలితాల్లో 10-15 వేల ఓట్లు పోల్ అయినట్లుగా వెల్లడించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి పెద్ద లీడర్లు పోటీ చేస్తున్నారు. వారికి ధీటుగా నిలబడి శెభాష్ అనిపించుకుంది.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 26 | 1 | 3,000 | Graduate | 0 |