తెలంగాణలోని హాట్ సీట్లలో కొడంగల్ నియోజకవర్గం ఒకటి. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఆయనపై బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి 9,319 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మరోసారి బీఆర్ఎస్ అధిష్టానం నరేందర్‌రెడ్డినే అభ్యర్థిగా నిలబెట్టింది. ఈసారి గెలిచి తన సత్తా నిరూపించుకోవాలని రేవంత్‌రెడ్డి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ ఉన్నారు. దీంతో ఆయన గెలుపు పార్టీకి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. కాగా కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవతి గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2009, 2014లో వరుసగా రెండు పర్యాయాలు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఈ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని బీజేపీ ఇంకా ప్రకటించలేదు. చికోటి ప్రవీణ్‌ను బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. రేవంత్ రెడ్డి లాంటి బలమైన నేతను ఢీకొట్టాలంటే ఆర్థికంగా బలవంతుడైన చికోటి ప్రవీణ్ అయితేనే బావుంటుందని ఆ పార్టీ భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూస్తే రేవంత్ రెడ్డి పోటీ ఈసారి చాలా ఆసక్తికరంగా మారనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 56 | 89 | 300,498,848 | Graduate | 13,019,901 |