ఖానాపూర్ నియోజకవర్గం నిర్మల్ జిల్లాలో ఉంది. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుత ఎమ్మెల్యే రేఖా నాయక్ 2009లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఓడిపోయారు.అనంతరం ఆమె 2014లో టీఆర్‌ఎస్(బీఆర్ఎస్) టికెట్‌పై తొలిసారి గెలిచారు. మళ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్‌పై రెండోసారి గెలిచారు. 2023 ఎన్నికలకు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించినా ఆమెకు భంగపాటు తప్పలేదు. దీంతో అక్టోబరు 6న ఆమె బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. నియోజకవర్గంలో పురుష ఓటర్లు 91 వేల 655 మంది ఉండగా, మహిళా ఓటర్లు 93 వేల 554 మంది ఉన్నారు. ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్, జన్నారం, ఉట్నూర్, సిరికొండ మండలాలు నియోజకవర్గంలో ఉన్నాయి. 1978లో ఏర్పడిన ఈ నియోజవర్గానికి అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అంబాజీ విజయం సాధించారు. 1983లో అంబాజీ(కాంగ్రెస్), 1985లో అజ్మీరా గోవింద్ నాయక్(స్వతంత్ర అభ్యర్థి), 1989లో భీం రావు(కాంగ్రెస్), 1994లో అజ్మీరా గోవింద్ నాయక్(టీడీపీ), 1999లో రమేశ్ రాథోడ్(టీడీపీ), 2004లో అజ్మీరా గోవింద్ నాయక్(టీఆర్ఎస్), 2008, 2009లలో సుమన్ రాథోడ్(టీడీపీ), 2014, 2018లలో అజ్మీరా రేఖా నాయక్(టీఆర్ఎస్) నుంచి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో.. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి అజ్మీరా రేఖా నాయక్ పోటీలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి రమేష్ రాథోడ్, బీజేపీ నుంచి అశోక్, బీఎస్పీ నుంచి హరి నాయక్ బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 67 వేల 138 ఓట్లు రాగా.. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ కు 46 వేల 428 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ కు 44.12 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్ కు 30.51 శాతం ఓట్లు, బీజేపీకి 15.63 శాతం ఓట్లు వచ్చాయి. తాజాగా రేఖా నాయక్ కాంగ్రెస్ లోకి వెళ్లడంతో నియోజకవర్గంలో రాజకీయా సమీకరణాలు ఎలా మారతాయోననే ఆసక్తి నెలకొంది.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |