ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావుది ప్రత్యేక పాత్ర. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం నియోజవర్గం నుంచి ఆయన బరిలో నిలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ పోటీలో నిలిచారు. బీజేపీ నుంచి ఇంకా ఎవరినీ అభ్యర్థిగా ప్రకటించలేదు. ఇక్కడ ఎన్నికలో ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్యే ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1983లో టీడీపీ నుంచి సత్తుపల్లిలో పోటీ చేసి ఓడిపోయారు. 1985, 1994, 1999, 2009లలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాజీ దివంగత ముఖ్యమంత్రి తు్వజకీ రామారావు, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. 2004లో సత్తుపల్లి నుంచి ఓడిపోయారు. 2009లో ఖమ్మం నుంచి విజయం సాధించారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయితే అదే ఏడాది టీఆర్ఎస్‌లో చేరారు. 2015లో శాసన మండలికి ఎన్నికయ్యారు. అనంతరం ఆయనను మళ్లీ మంత్రి పదవి వరించింది. 2015 నుంచి 2018 వరకు తెలంగాణ మంత్రిగా పని చేశారు. 2016లో జరిగిన పాలేరు ఉపఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సుచరితపై 45,684 ఓట్ల మెజారితో విజయం సాధించారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2023 సెప్టెంబర్ 14న బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 71 | 0 | 178,852,576 | Graduate | 8,156,736 |