ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఒకటి. ఖమ్మం లోక్ సభ పరిధిలోకి వస్తుంది. మొత్తం ఓటర్ల సంఖ్య 3,54,900. ఇందులో ఖమ్మం అర్బన్, రూరల్ మండలాలున్నాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్యే, మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1957లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి పెద్దన్న ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962లో నల్లమల గిరిప్రసాద్ రావు(సీపీఐ), 1967, 1972లలో మహమ్మద్ రజ్జబ్ అలీ(సీపీఐ), 1978లో అనంత రెడ్డి(కాంగ్రెస్), 1983, 1985లలో మంచికంటి రామ కిషన్ రావు(సీపీఐ), 1989, 1994లలో పువ్వాడ నాగేశ్వర్ రావు(సీపీఐ), 1999లో సుల్తాన్(కాంగ్రెస్), 2004లో తమ్మినేని వీరభద్రం(సీపీఐ), 2009లో తుమ్మల నాగేశ్వర రావు(టీడీపీ) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పువ్వాడ అజయ్, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో.. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ 1,02,760 ఓట్ల బంపర్ మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ నుంచి నామా నాగేశ్వర రావు 91,769 ఓట్లు, బీజేపీ అభ్యర్థి శారదా 2,325 ఓట్లు సాధించారు. టీఆర్ఎస్ కు 49.78 శాతం, టీడీపీకి 44.46 శాతం, బీజేపీకి 1.13 శాతం ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్, టీడీపీ మధ్య ఓట్ల తేడా 5 శాతంగా ఉంది. 2023లో ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్, కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వర రావు పోటీపడనున్నారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |