తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని శాసనసభ స్థానాల్లో ఖైరతాబాద్ ఒకటి. బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1967లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో ప్రస్తుత ఓట్లర సంఖ్య 2,68,679గా ఉంది. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని ఈ నియోజకవర్గంలో ఖైరతాబాద్‌తో పాటూ నారాయణగూడ, హైదర్‌గూడ, హిమాయత్‌నగర్, లక్డీకాపూల్, సోమాజీగూడ, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఉన్నాయి. బషీర్‌బాగ్, కింగ్ కోఠీ, చింతల్ బస్తీలోని కొన్ని ప్రాంతాలు కూడా ఈ నియోజకవర్గం పరిధిలోకే వస్తాయి. 2014, 2018 చరిత్ర ఇదీ.. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ తరపున సీ రామచంద్రారెడ్డి గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లలో 37.3 శాతం దక్కించుకుని ఆయన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై విజయం సాధించారు. ఇక 2018 నాటి ఎన్నికల్లో టీఆర్ఎస్( ఇప్పటి బీఆర్ఎస్) తరపున మళ్లీ దానం నాగేందర్ బరిలోకి దిగి సిట్టింగ్ ఎమ్మెల్యే సీ.రామచంద్రారెడ్డిపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన 44.56 శాతం ఓట్లు రాబట్టారు. ఆయనకు ఈ ఎన్నికలో 63,068 ఓట్లు రాగా సమీప అభ్యర్థి సీ.రామచంద్రారెడ్డికి 34,666 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన దాసోజు శ్రవణ్‌కు 33,549 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో దానం నాగేందర్ 28,402 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గ పునర్విభజనకు పూర్వం ఖైరతాబాద్ రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గంగా ఉండేది.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |