కరీంనగర్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కరీంనగర్ ఒక శాసనసభ ఒకటి. ఈ నియోజకవర్గంలో కరీంనగర్ సిటీ, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 1, 99, 331 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై 14, 974 ఓట్ల మెజార్టీతో గంగుల కమలాకర్ విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన దగ్గర నుంచి కరీంనగర్‌లో రెండు సార్లు బీఆర్ఎస్ అభ్యర్థే విజేతగా నిలిచారు. మరోసారి బీఆర్ఎస్ అధిష్టానం గంగుల కమలాకర్‌నే అభ్యర్థిగా నిలబెట్టింది. ఇక బీజేపీ నుంచి బండి సంజయ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఒడితల ప్రణవ్ పోటీలో ఉన్నారు. 1957లో నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఈ స్థానం జనరల్‌గానే ఉంది. 1957లో జువ్వాడి చొక్కారావు, 1962లో అల్లిరెడ్డి కిషన్‌రెడ్డి, 1967లో జువ్వాడి చొక్కారావు, 1972లో జువ్వాడి చొక్కారావు, 1978లో నలుమూచు కొండయ్య, 1983లో కటుకం మృత్యుంజయం, 1985లో చల్మెడ ఆనంద్‌రావు, 1989లో వెలిచాల జగపతిరావు, 1994లో జువ్వాడి చంద్రశేఖర్‌రావు, 1999లో కటారి దేవేందర్‌రావు, 2004లో ఎం.సత్యనారాయణరావు, 2009లో గంగుల కమలాకర్, 2014లో గంగుల కమలాకర్, 2018లో గంగుల కమలాకర్ విజయం సాధించారు. 2014లో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గంగుల కమలాకర్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ నుంచి పోటీ చేసిన బండి సంజయ్‌ను 24, 754 ఓట్ల మెజార్టీతో ఓడించారు. 2018లో.. ఇక 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ విక్టరీ సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ తరపున పోటీ చేసిన బండి సంజయ్‌ను 14,974 ఓట్ల మెజార్టీతో ఓడించారు. 2023లో.. ఇక 2023లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ బరిలోకి దిగారు. బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ప్రణవ్ బరిలో ఉన్నారు. మరీ ఈసారి విజయం ఎవర్నీ వరిస్తుందో వేచి చూడాలి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |