కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బండి సంజయ్.. అనతికాలంలోనే తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పొచ్చు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి బీజేపీ తరపున పోటీ చేసిన ఆయన.. తన సమీప ప్రత్యర్థి గంగుల కమలాకర్ (బీఆర్ఎస్) పై 14,974 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి బి.వినోద్ కుమార్‌పై 89,508 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. మూడోసారి ఎంపీగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థిపై అత్యధిక మెజార్జీతో గెలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలందరికంటే ఎక్కువ మెజారిటీతో గెలుపొందడం విశేషం. ప్రస్తుతం ఈయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలంగాణ ఎన్నికలు -2023లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున గంగుల కమలాకర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ప్రధానంగా వీరి మధ్యే పోటీ నెలకొనే అవకాశాలున్నాయి.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 52 | 59 | 7,951,000 | Post Graduate | 1,784,890 |