కామారెడ్డి జిల్లా పరిధిలోని కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం బీఆర్ఎస్ నేత గంప గోవర్ధన్ నేతృత్వం వహిస్తున్నారు. జహీరాబాద్ లోక్‌సభ పరిధిలోని ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 1,69,918 వోటర్లు ఉన్నారు. జిల్లాలోని కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బిక్నూర్, బీబీపెట్, రాజంపేట్ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రజలు తరువాత టీడీపీకి కొన్నిసార్లు ఆ తరువాత కాంగ్రెస్‌కు కొన్ని సార్లు అధికారం కట్టబెట్టారు. 1952లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో విఠల్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆ తరువాత 57లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన టీఎన్ సదాలక్ష్మి గెలుపొందారు. 62లో విఠల్‌రెడ్డిగారి వెంకటరామా రెడ్డి(కాంగ్రెస్) విజయం సాధించారు. 1972లో కాంగ్రెస్ నేత వై.సత్యనారాయణ, 1978లో కాంగ్రెస్ నేత బి. బాలయ్య విజయం సాధించారు. 1983,85 ఎన్నికల్లో టీడీపీకి చెందిన నేతలు పార్సి గంగయ్య, ఎ.కృష్ణమూర్తి గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ నేత ముహమ్మద్ షబ్బీర్ అలీ గెలుపొందగా 94లో టీడీపీ తరపున గంప గోవర్ధన్ గెలిచారు. 1999లో మళ్లీ టీడీపీ తరపున యూసుఫ్ అలీ ఎమ్మెల్యే అయ్యారు. 2004లో కాంగ్రెస్ నేత ముహమ్మద్ అలీ షబ్బీర్ విజయం సాధించగా, 2009 నుంచి జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో గంప గోవర్ధన్ వరుసగా విజయాలు సాధిస్తున్నారు. 2018 ఎన్నికల్లో గంపగోవర్ధన్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ముహమ్మద్ షబ్బీర్ అలీపై 5,007 వోట్ల మెజారిటీతో గెలిచారు. 2014లోనూ ఆయన షబ్బీర్ అలీపై 18,683 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |