కామారెడ్డి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జుక్కల్ కూడా ఒకటి. ఎస్సీ రిజర్వర్డ్ నియోజకవర్గమైన జుక్కల్ జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉంది. ప్రస్తుతం 1,56,317 వోటర్లు ఉన్న ఈ నియోజకవర్గానికి బీఆర్ఎస్‌కు చెందిన హన్మంత్ షిండే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జిల్లాలోని జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పిట్లం, నిజాం సాగర్, పెద్ద కొడప్గల్ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. 1957లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మాధవ్ రావ్ గెలవగా, ఆ తరువాత ఎన్నికల్లో నాగ్‌నాథ్ రావ్ కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన రెండు సాధారణ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్ధులే గెలుపొందారు. 1978 నుంచి 1985 వరకూ ఈ నియోజకవర్గాకి కాంగ్రెస్ ఎమ్మెల్యే గంగారామ్ ప్రాతినిధ్యం వహించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బేగారి పండరి గెలుపొందగా ఆ తరువాతి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కె.అరుణ విజయం సాధించారు. 2009 నుంచి ఇప్పటివరకూ హన్మంత్ షిండే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2009లో టీడీపీ తరుపున హన్మంత్ షిండే బరిలోకి దిగగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన బీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో హన్మంత్ షిండే తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి గంగారామ్‌పై 29,625 వోట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లోనూ ఆయన గంగారాంపై 35,507 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |