హైదరాబాద్‌లోని 15 శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్‌కు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. 1957లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో ప్రస్తుత ఓటర్ల సంఖ్య 2,90,877గా ఉంది. నగరంలోని ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్‌గూడ్, షేక్‌పేట్, శ్రీనగర్ కాలనీలోని కొంత భాగం ఈ నియోజకవర్గ పరిధిలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. 2014 నాటి ఎన్నికల్లో టీడీపీ తరపున, 2018 నాటి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఆయన గెలుపొందారు. 2018 నాటి ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్‌కు చెందిన పి. విష్ణువర్థన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలిచి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అంతకుమునుపు జరిగిన ఎన్నికల్లో ఆయన ఎంఐఎం పార్టీకి చెందిన నవీన్ యాదవ్‌పై 9,242 ఓట్ల తేడాతో గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విష్ణువర్థన్ రెడ్డి విజయం సాధించారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |