జగిత్యాల జిల్లాలో ఈ నియోజకవర్గం(జనరల్) ఉంది. ఇక్కడ 1,03,665 మంది పురుషులు, 1,10,330 మంది మహిళలు, 13 మంది ఇతరులు, సర్వీస్ ఓటర్లలో 35 మంది పురుషులు, మహిళలలు ముగ్గురు ఉండగా మొత్తంగా 2,14,228 ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో జగిత్యాల, జగిత్యాల గ్రామీణ, రాయకల్, సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి మండలాలు ఉన్నాయి. 1957లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి తొలి ఎన్నికలు అదే ఏడాదిలో జరగ్గా దేవకొండ హనుమంతరావు(కాంగ్రెస్), 1962లో ధర్మారావు(స్వతంత్రులు), 1967లో కెఎల్ఎన్ రావు(కాంగ్రెస్), 1972లో జగపతిరావు(కాంగ్రెస్), 1978లో సురేందర్ రావు(కాంగ్రెస్), 1983లో జీవన్ రెడ్డి(స్వతంత్రులు), 1985లో రాజేశం గౌడ్(టీడీపీ), 1989లో జీవన్ రెడ్డి(కాంగ్రెస్), 1994లో ఎల్ రమణ(టీడీపీ), 1999, 2004లలో జీవన్ రెడ్డి(కాంగ్రెస్), 2009లో ఎల్ రమణ(టీడీపీ), 2014లో జీవన్ రెడ్డి(కాంగ్రెస్), 2019లో సంజయ్ కుమార్(బీఆర్ఎస్) గెలుపొందారు. 2018లో గణాంకాలు ఇవే.. జగిత్యాలలో ఆరు సార్లు విజయం సాధించిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన డా.సంజయ్ కుమార్ 61 వేల 125 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై గెలిచారు. సంజయ్‌కు లక్షా 4 వేల 247 ఓట్లు రాగా, జీవన్ రెడ్డికి 43 వేల 62 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రవీంద్ర రెడ్డి కి 4 వేల 700 ఓట్లు మాత్రమే వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |