సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో హుజూర్‌నగర్ ఒకటి. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం.. 1972లో పునర్వ్యస్థీకరణలో భాగంగా రద్దైంది. అనంతరం 2009లో మళ్లీ ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో హుజూర్‌నగర్, నేరేడ్చెర్ల, గరిడేపల్లి, మట్టంపల్లి, మేళ్లచెర్వు, చింతలపాలెం, పాలకీడు మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,23,686 ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 1,10,410 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,13,266 మంది ఉన్నారు. ఇక్కడి నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన కోదాడ సిటింగ్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి జి.జగదీష్ రెడ్డి (బీఆర్ఎస్) పై 29,194 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి 80,835 ఓట్లు రాగా.. జగదీష్ రెడ్డికి 51,641 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి కాసోజు శంకరమ్మ (బీఆర్ఎస్) పై 23,924 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి 69,879 ఓట్లు రాగా.. శంకరమ్మకు 45,955 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి సనంపూడి సైదిరెడ్డి (బీఆర్ఎస్) పై 7,466 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి 92,996 ఓట్లు, సైదిరెడ్డికి 85,530 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో హుజూర్‌నగర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. ఈ కారణంగా 2019లో ఉప ఎన్నికలు వచ్చాయి. 2019 ఉప ఎన్నికలు.. 2019లో జరిగిన శాసన సభ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి.. తన సమీప ప్రత్యర్థి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఎన్. పద్మావతి (కాంగ్రెస్ ఐ) పై 43,358 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సైదిరెడ్డికి 1,13,095 ఓట్లు రాగా.. పద్మావతికి 69,737 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |