• Home » Telangana » Assembly Elections » Eatala Rajendar

Eatala Rajendar candidate from Huzurabad, Telangana Assembly Election 2023

LOST - 16,873
Eatala Rajendar
Huzurabad
BJP

సామాన్య కార్యకర్త స్థాయి నుంచి మంత్రి వరకు ఎదిగిన ఈటల రాజేందర్ 2 దశాబ్దాల తన రాజకీయ ప్రస్థానంలో ఓటమి ఎరుగని నేతగా పేరు పొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వడితెల ప్రణవ్ బాబు బరిలో దిగగా.. బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రధానంగా వీరి ముగ్గురి మధ్య పోటీ జరగనుంది. 2018 ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి ఏకంగా 43,719 మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై విజయం సాధించారు. దీంతో ఆరోసారి ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలుపొందారు. రెండో దఫా మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే అనివార్య కారణాలతో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల.. 2021లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. 2021 ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై 23,855 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 14 ఏళ్ల పాటు కేసీఆర్ వెన్నెంటే ఉంటూ ప్రత్యేక తెలంగాణ సాధనలో తనవంతు పాత్ర పోషించారు. 2002లో టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు ఈటల.. 2004 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌మ‌లాపూరం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్‌ రెడ్డిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004, 2008 ఎన్నికల్లో కమలాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 2009, 2010, 2014, 2018, 2021 ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి గెలుపొందారు.

Readmore

అభ్యర్థి సమాచారం

Age Cases Total Assets Education Liabilities
59 39 539,428,864 Graduate 190,020,640

ముఖ్య అభ్యర్థులు

విజయవంతమైన అభ్యర్థుల జాబితా 2018

2018 2014

Latest News

తాజా వార్తలు

మరిన్ని చదవండి