జనగాం జిల్లాలోని 3 శాసనసభ నియోజకవర్గాల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ఒకటి. ఇది ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,17,756గా ఉంది. ఈ నియోజకవర్గంలో స్టేషన్‌ఘన్‌పూర్, ధర్మసాగర్, రఘునాథ్‌పల్లె, లింగాలఘన్‌పూర్ మండలాలు ఉన్నాయి. 1957లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం 1972 వరకు జనరల్ స్థానంగానే ఉంది. అనంతరం 1978లో ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారిపోయింది. 1957లో బేతి కేశవరెడ్డి, 1962లో మోహన్‌రావు, 1967లో తోకల లక్ష్మారెడ్డి, 1972లో టీ.హయగ్రీవాచారి, 1978, 1983లలో గోక రామస్వామి, 1985లో బొజ్జపల్లి రాజయ్య, 1989లో ఆరోగ్యం బి, 1994, 1999లలో కడియం శ్రీహరి, 2004లో జీ.విజయ రామారావు, 2009, 2012, 2014, 2018లలో టీ.రాజయ్య ఇక్కడి నుంచి గెలుపొందారు. విభజన తర్వాత.. తెలంగాణ విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన టీ.రాజయ్య విజయం సాధించారు. అనంతరం కేసీఆర్ గవర్నమెంట్‌లో డిప్యూటీ సీఎంగా కూడా పని చేశారు. 2018లో కూడా మరోసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి రాజయ్య విక్టరీ సాధించారు. 2014లో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ విజయ రామారావుపై 58,829 ఓట్ల తేడాతో.. 2018లో శ్రీమతి సింగపురం ఇందిరాపై 35,790 ఓట్ల తేడాతో రాజయ్య గెలిచారు. 2023లో ఇలా.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ తరపున కడియం శ్రీహరి బరిలోకి దిగారు. ఇక కాంగ్రెస్ నుంచి ఇందిరా సింగపురం, బీజేపీ నుంచి డాక్టర్ గుండె విజయ రామారావు బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్య ఈసారి ప్రధానంగా పోటీ జరగనుంది.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |