• Home » Telangana » Assembly Elections » Gajwel

రాజధాని హైదరాబాద్ నుంచి 64 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ నియోజకవర్గం సిద్ధిపేట జిల్లాలో ఉంది. మెదక్ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనరల్ స్థానమైన ఈ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,27,333గా ఉంది. సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్, కొండపాక, వర్గల్, ములుగ్, జగదేవ్‌పూర్‌తోపాటు మెదక్ జిల్లాకు చెందిన తూఫ్రాన్ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. 1952లో పెండెం వాసుదేవు (పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్), 1957లో జేబీ ముత్యాల రావు (కాంగ్రెస్), 1962లో గజ్వేల్ సైదయ్య (స్వతంత్ర), 1967లో జేబీ ముత్యాల రావు(కాంగ్రెస్), 1972, 1978లలో గజ్వేల్ సైదయ్య (కాంగ్రెస్), 1983లో అల్లం సైలు (టీడీపీ), 1985లో బీ.సంజీవ్ రావు (టీడీపీ), 1989లో డా.జే గీతా రెడ్డి (కాంగ్రెస్), 1994లో జీ.విజయ రామారావు (టీడీపీ), 1999లో బీ.సంజీవ రావు (టీడీపీ), 2004లో డా.జే.గీతా రెడ్డి (కాంగ్రెస్), 2009లో తూముకుంట నర్సారెడ్డి(కాంగ్రెస్), 2014, 2018లలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (టీఆర్ఎస్) ఇక్కడ నుంచి గెలిచి ఎమ్మెల్యేలయ్యారు. 2018లో పోటీ ఎవరి మధ్య? 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన కేసీఆర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 88.97 శాతం భారీ పోలింగ్ నమోదవ్వగా కేసీఆర్ ఏకంగా 58,290 మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు 1,25,444 ఓట్లు (60.45 శాతం) పడగా. ఆయన సమీప ప్రత్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డికి 67,154 ఓట్లు (32.36 శాతం) ఓట్లుపడ్డాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కంటే సాయన్న, బిట్ల వెంకటేశ్వర్లకు ఓ మోస్తరు ఓట్లు పడగా నోటాకు 1624 ఓట్లు పడ్డాయి. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కేసీఆరే ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తం 84.22 పోలింగ్ శాతం నమోదవ్వగా కేసీఆర్ 19,391 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సమీప ప్రత్యర్థి అయిన ఒంటేరు ప్రతాప్ రెడ్డికి 34,085 ఓట్లు పడ్డాయి. ఆయన టీడీపీ నుంచి పోటీచేశారు

Readmore

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2018

2023 2018 2014
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00

గజ్వేల్ నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

తెలంగాణ విజేత/ఓడిపోయిన నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

Latest News

తాజా వార్తలు

మరిన్ని చదవండి