తెలంగాణ రాష్ట్రానికి వరుసగా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ మూడో దఫా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఊవిళ్లూరుతున్నారు. అన్నీ తానై బీఆర్ఎస్‌ను నడిపిస్తున్న ఆయన ఈసారి 2 నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతున్నారు. ఒక మెదక్ జిల్లాలోని గజ్వేల్ కాగా.. రెండవది కామారెడ్డి నియోజకవర్గం. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు బీజేపీ అధినాయకత్వం ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ నుంచి తూంకుంట నర్సారెడ్డిని పోటీలో నిలబెట్టింది. ఇక్కడ నువ్వానేనా అన్నట్టుగా ఫైటింగ్ జరగనుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఏకంగా 1,25,444 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మరోసారి భారీ విజయం అందించాలని కేసీఆర్ నియోజకవర్గ ప్రజలను కోరారు. మరోవైపు.. కేసీఆర్ కామారెడ్డి బరిలో కూడా నిలబడ్డారు. రెండు చోట్ల పోటీ చేయడంపై ప్రత్యర్థి పార్టీల్లో అనేక సందేహాలు ఉన్నాయి. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక కామారెడ్డిలో కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు వెంకట రమణారెడ్డిని బీజేపీ బరిలోకి దింపింది. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. వాస్తవానికి షబ్బీర్ అలీకి కామారెడ్డి కంచుకోట లాంటిది. కానీ ఈసారి కేసీఆర్ బరిలోకి దిగడంతో గట్టి పోటీ ఇచ్చేందుకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఈ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు చర్చ నడుస్తోంది.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 69 | 9 | 589,331,776 | Graduate | 245,113,632 |