• Home » Telangana » Assembly Elections » Dubbak

విప్లవోద్యమాలకు పెట్టింది పేరుగా నిలిచిన దుబ్బాక ఒకప్పుడు రాజగోపాలపేటగా ఉండేది. అనంతరం కాలంలో 1957 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దొమ్మాటగా మారిపోయింది. 2009 ఎన్నికల ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దొమ్మాట కాస్తా... ప్రస్తుత దుబ్బాకగా మారింది. ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గ పరిధిలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట, నార్సింగ్, భూంపల్లి అక్బర్‌పేట్ మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,90,523 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 93,742 మంది, 96,781 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2009 ఎన్నికలు.. 2009 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డి.. తన సమీప ప్రత్యర్థి సోలిపేట రామలింగారెడ్డి (బీఆర్ఎస్) పై 2,640 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ తరపున మూడు పర్యాయాలు పోటీ చేసి విజయం సాధించిన ముత్యంరెడ్డి.. రెండు సార్లు ఓటమి చెందారు. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి మళ్లీ గెలుపొందారు. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేసిన సోలిపేట రామలింగారెడ్డి.. తన సమీప ప్రత్యర్థి ముత్యం రెడ్డి (కాంగ్రెస్) పై 37,925 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రామలింగారెడ్డికి 82,234 ఓట్లు, ముత్యం రెడ్డికి 44,309 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి.. తన సమీప ప్రత్యర్థి మద్దుల నాగేశ్వర్ రెడ్డిపై 62,500 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రామలింగారెడ్డికి 89,299 ఓట్లు, నాగేశ్వర్ రెడ్డికి 26,799 ఓట్లు వచ్చాయి. అయితే 2020 ఆగస్టులో రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. 2020 ఉప ఎన్నికలు.. 2020 ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఎం.రఘునందన్ రావు.. తన సమీప ప్రత్యర్థి సోలీపేట సుజాత రెడ్డి (బీఆర్ఎస్) పై 1,079 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రఘునందన్ రావుకు 63,352 ఓట్లు రాగా.. సుజాతకు 62,273 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయగా.. 22,196 ఓట్లు దక్కాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి ఎం.రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి కత్తి కార్తీక పోటీ చేయనున్నారు.

Readmore

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2018

2023 2018 2014
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00

దుబ్బాక నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

తెలంగాణ విజేత/ఓడిపోయిన నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

Latest News

తాజా వార్తలు

మరిన్ని చదవండి