• Home » Telangana » Assembly Elections » M Raghunandan Rao

M Raghunandan Rao candidate from Dubbak, Telangana Assembly Election 2023

LOST - 53,513
M Raghunandan Rao
Dubbak
BJP

మాధవేని రఘునందన్‌రావు.. తెలంగాణ బీజేపీలో ముఖ్య నాయకుడు. 2020లో జరిగిన ఉపఎన్నికలో దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే వార్తాపత్రికలో పని చేసిన అనుభవం ఉంది. అనంతరం ఉమ్మడి ఏపీ హైకోర్టులో బార్ అసోసియేషన్‌లో అడ్వకేట్‌‌గా చేరారు. ఇక హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బెయిల్ పిటిషన్‌‌ను హ్యాండిల్ చేయడంతో రఘునందన్‌రావుకు మంచి పేరు వచ్చింది. రఘునందన్‌రావు తొలుత బీఆర్ఎస్‌లో ఉన్నారు. 2013లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారనే ఆరోపణలతో బీఆర్ఎస్ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తదనంతరం కాంగ్రెస్‌లో చేరారు. కానీ అక్కడ పార్టీ విధానాలు నచ్చకపోవడంతో కొద్ది రోజులకే బీజేపీలో చేరారు. 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో 2020లో వచ్చిన బైపోల్స్‌లో మాత్రం బీజేపీ నుంచి రఘునందన్‌రావు బరిలోకి దిగి విజయం సాధించారు. 2023లో ఇలా.. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎం.రఘునందన్‌రావు పోటీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఈ మూడు పార్టీలు దెబ్బ దెబ్బగా ఢీకొంటున్నాయి. ఈ సారి విజయం ఎవర్ని వరిస్తుందో వేచి చూడాలి

Readmore

అభ్యర్థి సమాచారం

Age Cases Total Assets Education Liabilities
58 25 170,537,152 Graduate Professional 74,138,064

ముఖ్య అభ్యర్థులు

విజయవంతమైన అభ్యర్థుల జాబితా 2018

2018 2014

Latest News

తాజా వార్తలు

మరిన్ని చదవండి