నల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో దేవరకొండ ఒకటి. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. దేవరకొండ నియోజకవర్గంలో దేవరకొండ, చింతపల్లి, గుండ్లపల్లి, చందంపేట, పెద్దఅడిసేర్లపల్లి, నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి మండలాలు ఉన్నాయి. మొత్తం 2,15,201 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,08,943 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,06,244 మంది ఉన్నారు. 2004, 2014లో సీపీఐ తరఫున పోటీ చేసి గెలిచిన రమావత్ రవీంద్ర కుమార్ 2018లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఈయనే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్.బాలూనాయక్.. తన సమీప ప్రత్యర్థి రవీంద్రకుమార్ రమావత్ (సీపీఐ) పై 7,468 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బాలూనాయక్‌కు 64,887 ఓట్లు రాగా.. రవీంద్రకుమార్‌కు 57,419 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి రవీంద్రకుమార్ రమావత్.. తన సమీప ప్రత్యర్థి బిల్యా నాయక్ (టీడీపీ) పై 4,216 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రవీంద్రకుమార్‌కు 59,717 ఓట్లు రాగా.. బిల్యా నాయక్‌కు 53,501 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన రవీంద్రకుమార్ రమావత్.. తన సమీప ప్రత్యర్థి బాలూ నాయక్ (కాంగ్రెస్) పై 38,848 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రవీంద్రకుమార్‌కు 96,454 ఓట్లు, బాలూ నాయక్‌కు 57,606 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |