రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో చొప్పదండి శాసన సభా స్థానం ఒకటి. కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఇది కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సుంకే రవిశంకర్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గం 1957లో ఏర్పాటైంది. ఈ నియోజక వర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,99,703. చొప్పదండి, బోయినపల్లి, గంగాధర, రామడుగు, కోడెమియల్, మాల్యల్ మొదలైన మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఈ నియోజక వర్గం ఏర్పాటైన తొలి పర్యాయంలో అంటే 1957లో పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీహెచ్ రాజేశ్వరరావు గెలుపొందారు. ఆ తర్వాత 1962లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన బి.రాములు విజయం సాధించారు. ఆ తర్వాత 1978లో కాంగ్రెస్ (ఐ) తరఫున శ్రీపతి రావు గెలిచారు. ఆ తర్వాత 1983లో టీడీపీ అభ్యర్థి అయిన గుర్రం మాధవరెడ్డి గెలిచారు. 1985 నుంచి 1994 వరకు టీడీపీకే చెందిన రామకిషన్ రావు వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ (ఐ) అభ్యర్థి సత్యనారాయణ గౌడ్, 2004లో టీడీపీకి చెందిన సానా మారుతి, 2009లో టీడీపీకి చెందిన సుద్దాల దేవయ్య, 2014లో టీఆర్ఎస్కు చెందిన శోభ, 2018లో టీఆర్ఎస్కు చెందిన రవిశంకర్ గెలిచారు. 2018లో పోటీ ఎవరి మధ్య? 2018లో చొప్పదండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి సోంకె రవికుమార్ మంచి మెజారీటీతో గెలుపొందారు. 42 వేల పైచిలుకు మెజారిటీ గెలుపొందారు. కాంగ్రెస్ నాయకుడు మేడిపల్లి సత్యం రెండో స్థానంలో నిలిచారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన బి.శోభ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఎస్.దేవయ్య రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో శోభకు ఏకంగా 54 వేల పైచిలుకు మెజారిటీ లభించింది.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |