జి. వివేక్ వెంకటస్వామి.. పెద్దపల్లి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత. నిజానికి.. తెలంగాణ ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందువరకూ ఆయన బీజేపీలో కొనసాగారు. బీజేపీ తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ.. 2023 నవంబర్‌లో బీజేపీ నుంచి వైదొలిగి, రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా తన కుమారుడు వంశీతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెన్నూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడంతో.. తన ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌కి పోటీగా రంగంలోకి దిగారు. తెలంగాణ ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. విశాఖ ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్ అయిన వివేక్ వెంకటస్వామి.. తొలుత కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. అయితే.. 2013లో ఆయన బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పార్టీలోకి చేరారు. 2014 వరకూ ఆ పార్టీ సభ్యుడిగా కొనసాగారు. కానీ.. 2014లో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. 2019 వరకూ ఆ పార్టీకి విధేయుడిగా పని చేశాడు. అనంతరం 2019లో బీజేపీ కండువా కప్పుకున్నారు. కానీ.. ఎన్నికలకు మరికొన్ని రోజులే ఉన్నాయన్నప్పుడు ఆయన బీజేపీని వీడారు. ఆ సమయంలో ఆయన హస్తం పార్టీ గూటికే చేరుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. అందరూ ఊహించినట్టుగానే వివేక్ తన కుమారుడితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 66 | 5 | 2,147,483,647 | Graduate Professional | 415,487,584 |