ఎంఐఎం పార్టీ ముఖ్య నాయకుడైన అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సోదరుడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి ఎంఐఎం తరపున పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి బోయ నరేశ్ పోటీ చేస్తుండగా.. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి ఉరడి సత్యనారాయణ పోటీ నుంచి వైదొలగారు. అనారోగ్య కారణాల చేత పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. అయితే ఎప్పుడూ తిరుగులేని విజయం సాధిస్తుండడం, బలమైన నేతగా పేరు ఉండడంతో అక్బరుద్దీన్ ఒవైసీకి చాంద్రాయణగుట్టలో ఈసారి ఎవరైనా పోటీ ఇస్తారో లేదో వేచి చూడాలి. 1999లో చాంద్రాయణగుట్ట నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అటు తర్వాత వరుసగా 2004, 2009, 2014, 2018లో చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేసి ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రత్యేక తెలంగాణగా ఏర్పడిన తర్వాత కూడా 2014, 2018లో కూడా చాంద్రాయణగుట్ట నుంచే పోటీ చేసి విక్టరీ సాధించారు. 2019లో తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అంతేకాకుండా 2004లో అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్‌గా కూడా ఉన్నారు. సాలార్-ఎ-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒవైసీ పాఠశాలల్లో పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. 2020లో సీఎం కేసీఆర్‌ను కలిసి మహంకాళి ఆలయ పునరుద్ధరణకు రూ.10 కోట్ల కోరారు. ఇక రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి కేసుల్లో ఇరుక్కున్నారు. అలాగే హత్యాయత్నానికి గురి కోలుకున్నారు.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 53 | 6 | 187,769,248 | 12th Pass | 59,920,552 |