నిజామాబాద్ జిల్లాలోని బోధన్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం బీఆర్ఎస్ నేత షకీల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని ఈ నియోజకవర్గంలో వోటర్ల సంఖ్య 1,67,250. 1952లో ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్, రేంజల్, నవీపేట్, ఎడపల్లి, సాలూర మండలాలు ఈ అసెంబ్లీ నియోజకవర్గ పరధిలో ఉన్నాయి. ఈ సీటుకు 1952లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఎస్ఎల్ శాస్త్రి గెలుపొందారు. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. 1983 -99 మధ్య టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించగా 1999-2014 వరకూ కాంగ్రెస్‌కు చెందిన పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఈ నియోజకవర్గానికి రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నేత ముహమ్మద్ షకీల్ అమిర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షకీల్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై 8,101 వోట్ల మెజారిటీతో గెలిచి తన సీటును నిలబెట్టుకున్నారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కూడా షకీల్ తమ సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిపై 15,884 వోట్ల మెజారిటీతో గెలుపొందారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |