జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి గద్వాల అయితే రెండోది ఆలంపూర్. ఈ నియోజకవర్గంలో సుమారు 22 శాతం ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని రికార్డులు వెల్లడిస్తున్నాయి. దీంతో ఆలంపూర్ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి. అవి ఆలంపూర్, వడ్డేపల్లి, రాజోలి, ఇటిక్యాల, అయిజా, మానవపాడు, ఉండవల్లి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు సార్లు ఎన్నికలు జరగ్గా ఒకసారి కాంగ్రెస్ పార్టీ, మరొకసారి టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంపత్ కుమార్ టీడీపీ అభ్యర్థి వీఎం అబ్రహంపై 6,730 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మందా శ్రీనాథ్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆయనకు కేవలం 38,136 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2014 ఎన్నికల తర్వాత టీడీపీ అభ్యర్థి అబ్రహం టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంపత్ కుమార్‌పై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వీఎం అబ్రహం 44,679 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి అబ్రహం 1,02,105 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ 57,426 ఓట్లు సాధించారు. మూడో స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి హరిజన అబ్రహంకు 8,803 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలుత వీఎం అబ్రహంకు టిక్కెట్ కేటాయించగా తాజాగా అభ్యర్థిని మార్చారు. అబ్రహం స్థానంలో విజయుడికి టిక్కెట్ కేటాయించినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి సంపత్ కుమార్ పోటీ చేస్తుండగా బీజేపీ మాత్రం ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |